పవన్ కథ.. నాని చెంతకు?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు ఒక సినిమా బాకీ ఉన్నారు. అంతేగాకుండా.. మైత్రీమూవీ మేకర్స్ ఇచ్చిన అడ్వాన్సు కూడా పవన్ దగ్గర ఉండడం, సంతోష్ శ్రీనివాస్ కూడా మైత్రీమూవీ మేకర్స్‌కు అందుబాటులో ఉండడంతో పవన్ ఆ సినిమా చేస్తారనే అందరూ అనుకున్నారు.
అంతేకాదు పవన్ కోసం సంతోష్ సిధ్ధం చేసిన కథను ఓకె చేయడంతో ఈ వాదనకు బలమొచ్చింది. అయితే ఈ లోపు పవన్ రాజకీయాల వ్యవహారాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా సందిగ్ధంలో పడింది. దీంతో ఈ కథ.. నానికి కూడా బాగుంటుందని భావించి ఆలస్యం చేయకుండా నానిని సంప్రదించారట సంతోష్.
ప్రస్తుతం నాని 'కృష్ణార్జునయుధ్ధం' నిర్మాణానంతర పనుల్లో ఉన్నారు. దీని తర్వాత నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీలో నటించనున్నారు. మరి నాని ఈ చిత్రంతో పాటు సంతోష్ సినిమాని కూడా సమాంతరంగా చేస్తారేమో చూడాలి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments