నాని రిలీజ్ డేట్ మారింది....
Send us your feedback to audioarticles@vaarta.com
నాని హీరోగా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం జెంటిల్ మన్. ఈ చిత్రంలో నాని డిఫరెంట్ రోల్ చేస్తున్నాడని టీజర్ చూసిన వారందరూ అంటున్నారు. అసలు నాని హీరోనా, విలనా అని తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. సురభి, నివేదితా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేస్తారని ముందుగా అందరూ అనుకున్నారు. అయితే సినిమాను జూన్ 1న విడుదల చేయాలనుకుంటున్నట్టు నాని కన్ ఫర్మ్ చేసేశాడు.
దాదాపు తొమిదేళ్ల తర్వాత నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రమిది. బందిపోటు పరాజయం తర్వాత ఇంద్రగంటి డైరెక్షన్ వస్తోన్న మూవీ. ట్రైలర్ చూస్తుంటే కూసింత ఆసక్తిని రేపుతుంది..మరి సినిమాలో ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే సుమీ...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com