నాని మొదటి ప్రయత్నం వర్కవుట్ కాలేదు
Send us your feedback to audioarticles@vaarta.com
కలిసొచ్చే కాలంలో ఏ పని చేసినా విజయం తథ్యం అంటారు పెద్దలు. అందుకే దర్శక నిర్మాతలు, నటీనటులు వారికి అచ్చొచ్చిన టైమ్‌కే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే వరుసగా ఎనిమిది సినిమాలతో విజయాలను అందుకున్న నేచురల్ స్టార్ నాని.. తొలిసారిగా వేసవిని టార్గెట్ చేస్తూ ఓ సినిమాను విడుదల చేశారు. ఆ సినిమానే.. నాని ద్విపాత్రాభినయం పోషించిన ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ కథానాయికలుగా నటించారు.
కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో నాని ఖాతాలో ట్రిపిల్ హ్యాట్రిక్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే.. నాని కెరీర్లో తొలిసారిగా వేసవిని టార్గెట్ చేస్తూ విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. గతంలో వచ్చిన రొటీన్ సినిమాలకి సైతం తన నటనతో విజయాన్ని అందించిన నాని.. ఈసారి ఆ మ్యాజిక్‌ని చేయలేకపోయారు. మొత్తానికి.. నానికి తొలి వేసవి చిత్రం కలిసి రాలేదన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com