చైత‌న్య‌తో నాని సినిమా..!!

  • IndiaGlitz, [Saturday,May 02 2020]

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగానే కాదు.. ప్రొడ‌క్ష‌న్‌లోకి కూడా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌ఫై నాని ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సినిమ‌ల‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి అ!, మ‌రో సినిమా హిట్ సినిమా. ఈ రెండు సినిమాలూ మంచి విజ‌యాన్ని సాధించాయి. ఇప్పుడు నాని మూడో సినిమా నిర్మించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ రీసెంట్‌గా నానితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని క‌థ‌ను వివ‌రించాడ‌ట‌. నానికి క‌థ బాగా న‌చ్చింద‌ని టాక్‌. అయితే ఈ సినిమా త‌న కంటే చైత‌న్య‌కు బాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌.

ఎలాగూ చైత‌న్య ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌త‌క్వంలో ల‌వ్‌స్టోరి సినిమా చేశాడు. ఈ సినిమా త‌ర్వాత చైత‌న్యకి కూడా మ‌రో సినిమా లేదు. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో చైత‌న్య సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వచ్చాయి. అలాగే లేటెస్ట్‌గా ఇప్పుడు నాని సినిమాలో చైత‌న్య న‌టిస్తాడ‌ని అంటున్నారు. ప‌రిమిత బ‌డ్జెట్‌లోనే ఈ సినిమా రూపొంద‌నుంది. అలాగే ఈ సినిమా ద‌శ‌ర‌థ్ మార్క్ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో సినిమా రూపొంద‌నుంద‌ని అంటున్నారు. మ‌రి క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాతే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుంది.

More News

రేపు ఉదయం 'గాంధీ' సిబ్బందిపై హెలికాఫ్టర్లతో పూలవర్షం

కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి మరీ యుద్ధం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి పాత్ర ఎనలేనిదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

వెంకన్నా.. నీ కొండను నువ్వే కాపాడుకో : నారా లోకేశ్

మే-01న టీటీడీ చైర్మన్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

కువైట్‌లో ఉంటున్న భారతీయులకు శుభవార్త..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో స్వరాష్ట్రాలను వదిలి ఇతరదేశాలకు, రాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంటికెళ్లలేక..

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు బన్నీ బంపరాఫర్..!

లవర్ బాయ్ సిద్ధార్థ్, జెనీలియా నటీనటులుగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా హిట్టయిన తర్వాత సినిమా తెరకెక్కించిన భాస్కర్ తన ఇంటిపేరునే

వైద్యులు సూపర్ హీరోలు.. : మహేశ్ బాబు

కరోనా మహమ్మారిపై ముందుండి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.