రవితేజతో నాని దర్శకుడు?
Send us your feedback to audioarticles@vaarta.com
వేణు శ్రీరామ్.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. మొదటి సినిమా 'ఓ మై ఫ్రెండ్' నిరాశపరచినా.. రెండవ సినిమా 'ఎం.సి.ఎ.'తో తన కెరీర్ గ్రాఫ్ నే అమాంతంగా మార్చేసుకున్న డైరెక్టర్. వదిన, మరిది అనుబంధం నేపథ్యంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన 'ఎం.సి.ఎ.' సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ పరంపరను కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది.
అంతేకాకుండా.. కలెక్షన్ల పరంగా నాని కెరీర్లోనే టాప్ ప్లేస్లో నిలబడింది ఈ సినిమా. ఇదిలా ఉంటే.. అవకాశం కుదిరితే మాస్ మహారాజా రవితేజని డైరెక్ట్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వేణు శ్రీరామ్ తాజాగా ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసారు.
అంతే కాదు.. తన రెండవ సినిమాను రవితేజతో చేయవలసి వుందని.. కాని కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని కూడా వెల్లడించారు. కాగా, త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని.. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com