ఆ విషయాన్ని కన్ ఫర్మ్ చేసిన నాని..
Send us your feedback to audioarticles@vaarta.com
అష్టాచమ్మా, భీమిలి కబడీ జట్టు, అలా మొదలైంది` వంటి విలక్షణ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో నాని ఇప్పుడు జి.ఎ2, గీతాఆర్ట్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్` చిత్రంలో నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నట్టు నాని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో నాని నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తానని అన్నాడు. నాని ఇచ్చిన క్లారిఫికేషన్ తో ఈ సినిమా గురించి వచ్చిన వార్తలను నాని కన్ ఫర్మ్ చేసినట్టయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com