బాలీవుడ్ మూవీకి షాకిచ్చిన నాని...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్రాల హవా భాషతో సంబంధం లేకుండా కొనసాగుతుంది. బాహుబలి నుండి ఆల్ ఇండియాలో తెలుగ సినిమా కలెక్షన్స్ రేంజ్ చాలా పెరిగిందనే చెప్పాలి. బాహుబలి`, శ్రీమంతుడు`, సినిమా చూపిస్త మావ` సినిమాల తర్వాత భలే భలే మగాడివోయ్` సినిమా సక్సెస్ రూట్ లో సాగుతుంది. మిడ్ బడ్జెట్ మూవీగా విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా సత్తా చాటుతుంది.
భలే భలే మగాడివోయ్` సెప్టెంబర్ 4న విడుదలై ఇప్పటికే యు.ఎస్ లో వన్ మిలియన్ కలెక్షన్స్ ను దాటింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదేరోజున విడుదలైన బాలీవుడ్ చిత్రం వెల్ కమ్ బ్యాక్` చిత్రం కంటే నాని చిత్రం ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా బాలీవుడ్ సినిమాకి ఓ రకంగా నాని షాకిచ్చాడనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com