సెన్సార్ పూర్తి చేసుకున్న నాని చిత్రం..
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అరవింద్ సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపొందిస్తోన్న ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ "భలే భలే మగాడివోయ్". నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. మారుతి దర్శకుడు. బన్నివాసు నిర్మాత. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రంలో నాని మతిమరుపు ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడట. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ లా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదలవుతోంది. తాజా సమాచారం ప్రకారం సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments