కొడుక్కి సారీ చెప్పిన నాని
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని తన కొడుకు అర్జున్‌కి సారీ చెప్పాడు. ఇంతకు కొడుక్కి నాని ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందో తెలుసా! వివరాల్లోకెళ్తే.. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జెర్సీ'. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ నెల 19న అంటే రేపు విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఓ ఫోటోను నాని ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో నాని, అతని కొడుకు అర్జున్ కూర్చుని ఉన్నారు.
అర్జున్ 'మా డాడీ నా పేరు దొంగలించాడు' అనే టీ షర్ట్ వేసుకున్నాడు. నాని టీషర్ట్‌పై 36 అనే నెంబర్ ఉంది. ఈ ఫోటోను షేర్ చేసిన నాని.. 'సారీ రా జున్ను తప్పలేదు' అనే మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. అందుకు కారణం కొడుకు అర్జున్ పేరుతోనే నాని జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల క్రికెటర్ పాత్రలో కనిపించనుండగా, నాని భార్యగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments