నాని ‘అంటే సుందరానికి’ నుంచి బర్త్‌డే హోమం వీడియో... రిలీజ్ డేట్ కూడా చెప్పేశారుగా
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ హిట్‌తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే నాని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆయన నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికి’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జరుపుకుంటోంది. గురువారం నాని పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఇవాళ ‘అంటే సుందరానికి’ సినిమా నుంచి బర్త్‌డే హోమం పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో నాని పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో పూజలు, హోమాలు చేపించినట్లు చూపించారు. చిన్నప్పటి నుంచి నానికి రకరకాల గండాలున్నాయని, వాటి కోసం పూజలు చేస్తున్నట్లు చూపించారు. వీటిని హీరో నాని తిట్టుకుంటూ నవ్వులు పండించారు. ఇందులో నానికి అమ్మగా సీనియర్ నటి రోహిణి, నాన్నగా నరేష్ కనిపించబోతున్నారు.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజారాణి ఫేమ్ నజ్రియా నజిమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సమ్మర్‌లో బడా సినిమాలు లైన్‌లో వుండటంతో ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.
'మీరంతా రెండు మూడు బ్లాక్ చేస్తే... మేము ఏడు చేయకూడదా?' అని నాని అడిగారు. 'ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్. మెల్లగా డిసైడ్ చేద్దాం' అని స్వయంగా హీరో నాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 22, 29 .. మే 6, 20, 27 .. జూన్ 3, 10ల తేదీలను తెలిపారు. అయితే వీటికి చెక్ పెడుతూ... సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ‘‘ బర్త్ డే హోమం’’ వీడియోతో పాటు అనౌన్స్ చేశారు. జూన్ 10వ తేదీన ‘అంటే సుందరానికి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com