Ante Sundaranaki Trailer : అంటే సుందరానికి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. గెట్ రెడీ..!!

  • IndiaGlitz, [Monday,May 30 2022]

నేటీతరం హీరోల్లో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో ఒకడిగా మన్ననలు పొందుతున్న నాని.. హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. మధ్యలో కాస్త డౌన్ అయినా ఇటీవల శ్యామ్ సింగరాయ్‌తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి ఎక్కేశాడు నాని. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘‘అంటే సుందరానికి’’. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నానికి ఆ జోనర్ అంత కలిసి రావట్లేదు. తనకు బాగా కలిసొచ్చిన కామెడీ తరహా కథల వైపు మళ్లీ మొగ్గుచూపారు నాని. అలా చేస్తున్నదే ‘అంటే సుందరానికి’’.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన రాజా రాణి ఫేమ్ నజ్రీయా నజ్రిమ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. నరేశ్, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఆల్‌మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 10న తెలుగుతో పాటు త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల కానుంది.

దీంతో ‘‘ అంటే సుందరానికి’’ ప్రమోషనల్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్ . అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ‘‘అంటే సుంద‌రానికి’’ ట్రైల‌ర్ డేట్‌ను మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. జూన్ 2న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్రబృందం ఓ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నిన్న ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. నాని, నజ్రీయా, నదియా కాంబినేషన్‌లోని సీన్స్‌కు సంబంధించిన బ్లూపర్స్‌ను విడుదల చేశారు. సెట్‌లో నజ్రీయా చేసిన అల్లరిని ఇందులో చూపించారు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆమె నవ్వుతూ, నవ్విస్తూ వుండే బ్లూపర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.