నితిన్, నాని ముఖ్య అతిధులుగా నిత్యామీన‌న్ 100 డేస్ ఆఫ్ ల‌వ్ ఆడియో

  • IndiaGlitz, [Monday,July 11 2016]

ఈనెల 13న విడుద‌ల కానున్న 100డేస్ ఆఫ్ ల‌వ్ ఆడియో ఫంక్ష‌న్ కు నితిన్, నాని ముఖ్య అతిధులుగా రానున్నారు. నాని తో అలా మొద‌లైంది, నితిన్ తో ఇష్క్, గుండెజారి గ‌ల్లంతయ్యిందే సినిమాల‌తో నిత్య తో జోడీ క‌ట్టిన‌ వీళ్లు ఇప్పుడు నిత్యమీన‌న్ సినిమా ఆడియోను ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుద‌ల చేయ‌నున్నారు.

ఇప్ప‌టికే దుల్క‌ర్ స‌ల్మాన్, నిత్య మీన‌న్ లు క‌లిసి న‌టించిన సినిమాల‌న్నీ ఎంతో మంచి స‌క్సెస్ ను ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న 100 డేస్ ఆఫ్ ల‌వ్ సినిమా వీటన్నింటినీ మ‌రిపించేది గా తెర‌కెక్కించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు . జీన‌స్ ముహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో, SSC మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో , ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రం మ‌ల‌యాళం లో ఎంతటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను హైద‌రాబాద్ లో ఈనెల 13న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఓకే బంగారంతో యూత్ ని క‌ట్టిప‌డేసిన ఈ జంట‌, ఈ సినిమాతో అంద‌రికీ మరింత చేరువ కానున్నారు. మంచి రొమాంటిక్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జులై నెలాఖ‌రుకి విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

More News

రామ్ తమిళియన్ గెటప్ అందుకా..

తమిళియన్ గెటప్ లోఇలా...వెరైటీగా రామ్ దర్శనమిచ్చారు.

హ‌రిత‌హారంలో త‌న కోరిక బ‌య‌ట‌పెట్టిన బ‌న్ని

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో ఈరోజు అల్లు ఫ్యామిలీ మెంబ‌ర్స్ అల్లు అర‌వింద్, అల్లు అర్జున్,  బ‌న్ని భార్య స్నేహ‌, బ‌న్ని త‌న‌యుడు అయాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈరోజు ఉద‌యం త‌న ఇంటి ద‌గ్గ‌ర అల్లు అర‌వింద్, అల్లు అర్జున్ మొక్క‌లు నాటారు.

అజిత్ తో చేయడానికి నేను సిద్ధం- పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు లండన్ ట్రిప్ నుండి మలేషియాకు చేరుకున్నాడు.

బుల్లితెర పై సుమ సరికొత్త సంచలనం..

ఆడియో ఫంక్షన్స్ కు,టీవీ ప్రొగ్రామ్స్ కు యాంకర్ గా పలు కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే మల్టీటాలెంటెడ్ సీనియర్ యాంకర్ సుమ.

ఆ బాధ్యత మనపైనే ఉంటుంది - రానా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఇచ్చిన హరితహారం పిలుపుకు సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.