మళ్లీ క్రేజీ కాంబినేషన్

  • IndiaGlitz, [Monday,August 10 2015]

అష్టాచమ్మా..సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. క్లాస్ కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో నాని మంచి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో మరే సినిమా రూపొందలేదు.

తాజాగా వీరి కలయికలో మరో సినిమా రూపొందనుందని ఫిలిం వర్గాల్లో మాటలు వినపడుతున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను రూపొందించే మోహనకృష్ణ ఇంద్రగంటికి గత చిత్రం బందిపోటు' తీవ్ర నిరాశను మిగిల్చింది. మరి నానితో ఒకవేళ సినిమాని రూపొందిస్తే ఎలాంటి సినిమాని రూపొందిస్తాడో వేచి చూడాలి..