డిఫరెంట్ గెటప్స్ లో నాని - కీర్తిల లోకల్ సెల్ఫీ 1
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని - నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం నేను లోకల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇటీవల నేను లోకల్ సింగిల్ షాట్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టీజర్ తో ఆకట్టుకున్న లోకల్ జంట ట్విట్టర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
కొత్తగా నాని - కీర్తి డిఫరెంట్ గెటప్స్ తో సెల్ఫీ తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. లోకల్ సెల్పీ 1 అంటూ... ఇలాంటి సెల్ఫీలు మరిన్నివస్తాయి అంటూ నాని ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. నాని ట్వీట్ చేసిన కొద్ది సేపటికే కీర్తి సురేష్ కూడా ట్వీట్ చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments