‘వి’.. 200 దేశాలు, టెరిటరీస్‌లో.. ఉద్వేగంగా ఉంది: నాని
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని.. సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అంతర్జాతీయంగా ‘వి’ విడుదల కాబోతోంది. నివేదా థామస్, అదితి రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఇండియాతో పాటు మరో 200 దేశాలు.. టెరిటరీస్‌లో ఉన్న ప్రైమ్ సభ్యులంతా ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రం విడుదలపై నాని మాట్లాడుతూ.. తాను యాక్షన్ థ్రిల్లర్ మూవీస్‌ను చాలా ఇష్టపడతానని వెల్లడించాడు. అలాంటి థ్రిల్లర్స్‌లో ‘వి’ కూడా ఒకటని నాని తెలిపాడు. ఈ చిత్రం ఏకకాలంలోనే థ్రిల్లర్‌తో పాటు, నాటకీయత, మంచి యాక్షన్‌ను ప్రేక్షకులకు అందిస్తుందన్నాడు. సుధీర్‌బాబుకి.. తనకు మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ గేమ్ తనను ఈ సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టేలా చేసిందని వెల్లడించాడు. ‘వి’ అంతర్జాతీయ ప్రీమియర్‌పై తానెంతో ఉద్వేగంగా ఉన్నానని నాని వెల్లడించాడు.
ఇది తన 25వ సినిమా అని నాని తెలిపాడు. ఈ సినిమాను 200 దేశాలు, టెరిటరీస్‌లో ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రైమ్ వీడియోలో చూసే అవకాశం తన అభిమానులకు, సపోర్టర్స్‌కి కలిగిందని వెల్లడించాడు. వారందరికీ ధన్యవాదాలు తెలిపేందుకు ఇంకు మించిన మార్గం మరొకటి లేదని నాని తెలిపాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని కూడా నాని వెల్లడించాడు. తన మొదటి సినిమా విడుదలైన రోజే.. అంతర్జాతీయంగా ఈ సినిమా ప్రదర్శింపబడుతోందని.. అదే సెప్టెంబర్ 5 అని నాని పేర్కొన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com