'జంబల‌కిడిపంబ‌' లో అదిరిపోయే కాన్సెప్ట్ - హీరో నాని

  • IndiaGlitz, [Thursday,May 03 2018]

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి, జో జో జోస్‌, శ్రీనివాస్ రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం 'జంబ ల‌కిడి పంబ‌'.  ఈ సినిమా టీజర్ ను హీరో నాని  గురువారం హైదరాబాద్ లో  విడుద‌ల చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీనివాస్‌రెడ్డి ,నిర్మాతలు  ర‌వి,  జో జో జోస్‌ , ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీ కృష్ణ‌, స‌హ నిర్మాత బి.సురేశ్ రెడ్డి,లైన్ ప్రొడ్యూస‌ర్‌ స‌ంతోష్‌ సహా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా...హీరో నాని  మాట్లాడుతూ - ఈవీవీగారి 'జంబల‌కిడిపంబ‌' నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. అదే టైటిల్ తో సినిమా అనగానే ,అలాంటి కాన్సెప్ట్ మళ్ళీ రావడం కష్టం కదా ఎలా అనుకున్నాను. కానీ వీళ్ళకి అదిరిపోయే కాన్సెప్ట్ దొరికింది . కరెక్టుగా టైటిల్ కూడా బాగా మ్యాచ్ అయ్యింది. మనం ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని కాన్సెప్ట్ ఇది. చాలా ఫన్ గా,సరదాగా చేసినట్టు అనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే కచ్చితంగా హిట్ కొడతారనిపిస్తోంది .

ఇక శ్రీనివాస రెడ్డి చేస్తే తిరుగేముంది !నాకిష్టమైన నటుల్లో ఆయన ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ అంటే ఫస్ట్ నుంచి నాకిష్టం. ఆయన ఫ్రేమ్ లో ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ గారంటీ . నాలుగైదు సీన్స్ లో కనిపించినా ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన సినిమా మొత్తం ఉన్నారంటే  'జంబల‌కిడిపంబ‌' ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోండి. ఈ టీజర్ ని రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది.  'జంబల‌కిడిపంబ‌' బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 

హీరో శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ - మా సినిమా టీజర్ ను నాని గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది  అన్నారు.

నిర్మాత ర‌వి మాట్లాడుతూ - శ్రీనివాస్ రెడ్డిగారు హీరోగా న‌టించిన ఈ చిత్రం టీజర్ ను నాని గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వ‌స్తుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులంద‌రికీ నచ్చుతుంది అన్నారు.

ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీ కృష్ణ మాట్లాడుతూ - 'జంబ ల‌కిడి పంబ‌' సినిమా క‌ల్ట్ మూవీ. ఇందులో 'జంబ ల‌కిడి పంబ‌' అనే ప‌దానికి అర్థం లేదు. కానీ అదే టైటిల్‌గా పెట్టిన ఈ సినిమాతో ఈవీవీగారు కామెడీలో కొత్త కోణాన్ని చూపారు. అప్ప‌టి సినిమాకు.. ఇప్పుడు మేం చేసిన సినిమాకు సంబంధం లేదు. క‌థ‌కు సూట్ అవుతుంద‌నిపించి ఈ టైటిల్‌ను పెట్టాం అన్నారు. 

More News

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'బంగారి బాలరాజు'

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం

ఎక్స్ ఎల్ సినిమా సరికొత్త టెక్నాల‌జి తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'

ఈ స‌మ్మ‌ర్ చిత్రాల్లో భారీ అంచనాలతో మే 4న విడుదలౌతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్  న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కి  సాంకేతికపరమైన అదనపు హంగులు తోడయ్యాయి.

మ‌హేష్ సినిమాలాగే బ‌న్నీ సినిమాలో కూడా..

ఈ వేస‌వి టాలీవుడ్‌కు బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’..

మెహ‌రీన్‌.. ఈ ఏడాది కూడా అలాగే

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ (2016) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన‌ మెహరీన్..

సాహో.. బ‌డ్జెట్ పెరుగుతోందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’.