నాని 28.. ఆ సినిమా స్టైలేన‌ట‌..!

  • IndiaGlitz, [Tuesday,November 24 2020]

రీసెంట్‌గా నేచుర‌ల్ స్టార్ నాని, నజ్రీయా జంట‌గా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంటే సుందరానికీ’ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేసి, 2021లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు యూనిట్‌ తెలియజేసింది.

ఇందులో నాని వేష‌ధార‌ణ చాలా డిఫరెంట్‌గా క‌నిపిస్తోంది. లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా అల్ల‌రి న‌రేశ్ సీమ‌శాస్త్రిని పోలి ఉంటుంద‌ని అంటున్నారు. ఓ ఫ్యాక్ష‌నిస్ట్ అమ్మాయిని బ్రాహ్మ‌ణ అబ్బాయి ప్రేమిస్తాడు. కులాలు వేరు కావ‌డంతో ఒప్పుకోర‌ని తెలిసి, త‌న కుటుంబంతో స‌హా అక్క‌డ‌కు వెళ్లి ఆ యువ‌కుడు ఫ్యాక్ష‌నిస్ట్‌గా క‌ల‌రింగ్ ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవ‌డ‌మే క‌థాంశం. ఇదే త‌ర‌హా కాన్సెప్టుతోనే ‘అంటే సుందరానికీ’ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ సినిమాలో బ్ర‌హ్మ‌ణ యువ‌కుడిగా నాని క‌నిపిస్తార‌ట‌. క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌జ్రీయ క‌నిపిస్తుంద‌ట‌. ఇందులో న‌జ్రీయ వాళ్ల ఫ్యామిలీ హీరో నాని ఫ్యామిలీని ఒప్పించ‌డానికి పాట్లు ప‌డ‌తార‌ట‌. మ‌రి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు.