రెండు ప్రేమకథలు..పునర్జన్మలతో నాని 27
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని వరు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే తన 25వ సినిమా `వి`ను పూర్తి చేశాడో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన 26వ సినిమాకు రెడీ అయిపోయాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండా తన 27వ సినిమాను రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగ రాయ్`ని అనౌన్స్ చేశాడు. `టాక్సీవాలా` తర్వాత రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది.
నిజానికి ముందు రాహుల్ సంక్రిత్యాన్ టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తో సినిమా కథను తయారు చేసుకున్నాడు. హీరోలను కలిసినా కూడా ఎవరూ ఒప్పుకోలేదు. దాంతో ఈ దర్శకుడు మరో సబ్జెక్ట్‌తో నానిని ఒప్పించాడని టాక్. వివరాల మేరకు ఇదొక ప్రేమకథ. ఇందులో రెండు ప్రేమకథలుంటాయట. అందులో ఒకటి హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగితే.. మరో ప్రేమకథ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందట. ఈ రెండు ప్రేమకథలకు పునర్జన్మల లింక్ ఉంటుందని సమాచారం. మరి నాని ఇందులో డబుల్ రోల్ చేస్తాడా? లేదా? అసలు ఎలాంటి లుక్‌లో కనపడతాడు? అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com