సవారి ఫిబ్రవరి 7న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన సవారీ సినిమా విడుదలకు సిద్ధమైంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే యానిమల్ లవ్ ఎంటర్టైనర్గా సవారి చిత్రం తెరకెక్కింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ మరియు ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు. నైజాంలో సవారి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. సవారీ చిత్రంలోని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాహుల్ సిప్లిగంజ్ పాడిన నీ కన్నులు లిరికల్ సాంగ్ 5 మిలియన్ వ్యూస్ దక్కించుకుని.. ఇంకా వ్యూస్ తెస్తూనే ఉంది. దాంతో పాటే ఉండిపోయా పాటకు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది.
సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మీడియా ముందుకు వచ్చి విడుదల తేదీని ఖరారు చేసారు మేకర్స్. ఈ సినిమా 2020, ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com