నందు నూతన చిత్రం కన్నుల్లో నీ రూపమే
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టాలెంటెడ్ హీరో నందు, కన్నడ భామ తేజస్వినీ ప్రకాష్ జంటగా నటిస్తున్న చిత్రం కన్నుల్లో నీ రూపమే. నూతన దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ భాసాని నిర్మిస్తున్నారు. హార్ట్ టచ్చింగ్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందబోతున్న ఈ సినిమాకు కన్నుల్లో నీ రూపమే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జూన్ 15 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రాబోతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భాస్కర్ భాసాని మాట్లాడుతూ....ఫొటో, 100%లవ్, ఆటోనగర్ సూర్య, 365 డేస్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు ఈ సినిమాలో ఓ విభన్నమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. అలానే ఈ సినిమాతో తేజస్వినీ తెలుగు చిత్ర సీమకి పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ కన్నడలో పలు చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న బిక్స్ ఇరుసడ్ల చిత్ర కథను చాలా అద్భుతంగా మలిచాడు, అలానే సంగీత దర్శకుడు సాఖేత్ కంపోజ్ చేస్తోన్న పాటలు కచ్ఛితంగా ప్రేక్షకుల్ని అలరిస్తాయయి అని తెలిపారు. జూన్ 15 నుంచి షూటింగ్ మొదలుపెట్టి సాధ్యమైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments