'విశ్వామిత్ర' లో నందితా

  • IndiaGlitz, [Saturday,June 30 2018]

‘గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన రాజకిరణ్ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'విశ్వామిత్ర' టైటిల్ తో మాధవి అద్దంకి, రజనీకాంత్‌ యస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం గత నెల ప్రారంభమైన విషయం తెలిసిందే. పది రోజులుగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంది. 'ప్రేమకథా చిత్రమ్' ఫేం నందితా ఇందులో కథానాయిక. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్‌ ‘నందితా’ ఇంట్రడక్షన్, సినిమాలో కీలకమైన పోలీస్‌స్టేషన్‌ సీన్లను ప్రముఖ నటుడు ప్రసన్నపై చిత్రీకరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్‌ మాట్లాడుతూ – ‘‘స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్‌ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. నా గత చిత్రాలు ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నట్లుగానే ఈ సినిమా కూడా అదే థ్రిల్‌ మెయింటేన్‌ చేస్తుంది. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్‌: ఉపేంద్ర, ఆర్ట్‌–చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: రాజకిరణ్‌

More News

'అల్లరి నరేష్' - ఏకె ఎంటర్టైన్మెంట్స్' సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి

హీరో "అల్లరి నరేష్", నిర్మాత అనిల్ సుంకరల కాంబినేషన్‌లో ఎ టీవి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రానికి  "నందిని నర్సింగ్ హోమ్"

జులై 27న 'హ్యాపి వెడ్డింగ్' గ్రాండ్ రిలీజ్

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌.

సంపూర్ణేష్ బాబు, సలోని టక్కరి దొంగ..చక్కని చుక్క

గతంలో అలీ కథానాయకుడిగా అల్లరి పెళ్లికొడుకు చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జె.జె.ప్రకాష్ రావు, నిర్మాత ఎం.రాజ్ కుమార్ కలయికలో  తాజాగా మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

గోపీచంద్‌, సంప‌త్ నంది.. మ‌రోసారి

'రచ్చ', 'బెంగాల్ టైగర్' లాంటి యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌ను తెరకెక్కించిన యువ ద‌ర్శ‌కుడు సంపత్ నంది..

ఆ బ‌యోపిక్‌లో అన‌సూయ‌?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి, దివంగ‌త నేత‌ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'యాత్ర'.