ఎన్టీఆర్ చిత్రంలో నందిత...

  • IndiaGlitz, [Friday,April 21 2017]

ప్రేమ క‌థా చిత్ర‌మ్‌తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిత‌రాజ్ ఈ మ‌ధ్య సినిమాల్లో న‌టించ‌క చాలా గ్యాప్‌తీసుకుంది. ఎట్ట‌కేల‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న 'జై ల‌వ‌కుశ‌' చిత్రంలో అల్రెడి రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇప్పుడు నందిత‌రాజ్ కూడా న‌టించి సినిమాకు ఇంకా గ్లామ‌ర్ మెరుగులు దిద్దింది.
నందిత‌రాజ్ పాత్ర చిన్న‌దే అయినా, చాలా ప్రాముఖ్య‌త ఉండే పాత్ర అట‌. ఈ పాత్ర చిత్రీక‌ర‌ణ‌ను అల్రెడి పూర్తి చేసేశార‌ట‌. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్టులో విడుద‌ల చేయ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నారు. అల్రెడి విడుదలైన సినిమా టైటిల్ లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.