పోర్న్ రాకెట్ కేసులో అడ్డంగా బుక్కైన నటి.. ఆమె చేసిన ఘనకార్యం ఇదే!
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ వైపు బాలీవుడ్ లో రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంటే.. పశ్చిమ బెంగాల్ లో ఈ తరహా కేసు మరొకటి బయట పడింది. ఈ కేసులో కోల్ కతా పోలీసులు నటి, మోడల్ అయిన నందిత దత్తని అరెస్ట్ చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు నటులు, నటీమణులు గతంలో వ్యభిచారం కేసుల్లో చుక్కుకోవడం చూశాం.
నందితా దత్తా పోర్న్ చిత్రాల తెరకెక్కిస్తూ బుక్కైంది. కోల్ కతాకు చెందిన నందిత దత్తా వయసు 30 ఏళ్ళు. మోడల్ గా రాణించిన తర్వాత హీరోయిన్ గా అవకాశాల కోసం చిత్ర పరిశ్రమకు వచ్చింది. కానీ ఆమెకు సినిమాల్లో అవకాశాలు మాత్రం అర కొరగానే అందుతూ వచ్చాయి.
సినిమాల్లో తన కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో నందిత దత్తా పోర్న్ ని ఎంచుకుంది. నాన్సీ బాబీ పేరుతో పోర్న్ కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించడం ప్రారంభించింది. బిజినెస్ పెంచడం కోసం తనతో పాటు మరి కొందరు మోడల్స్ ని పోర్న్ ఊబిలోకి దించాలని నందిత భావించింది.
దీనితో తనకు పరిచయం ఉన్న కొందరు యువ మోడల్స్ ని.. వెబ్ సిరీస్ లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించింది. ఆ మోడల్స్ తన మాయలో పడ్డాక వారిని పోర్న్ చిత్రాలలోకి దింపింది. కొందరిని బలవతం చేసింది. దీనితో బాధితులైన కొందరు మోడల్స్ పోలీసులని ఆశ్రయించారు. ఇలా నందిత బండారం పోలిసుల ఎదుట బట్టబయలైంది.
దీనితో పోలీసులు నందితని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం బిజినెస్ వెనుక ఉన్నది నందిత మాత్రమేనా.. ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com