'పిట్టగోడ' రెండో పాటను విడుదల చేసిన దర్శకురాలు నందినిరెడ్డి
- IndiaGlitz, [Wednesday,December 07 2016]
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పిట్టగోడ'. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. మంగళవారం మొదటి పాట విడుదల కాగా, రెండోపాటను బుధవారం హైదరాబాద్‌లోని రేడియో మిర్చి ఆఫీస్‌లో ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నందినిరెడ్డి, దర్శకుడు అనుదీప్ కె.వి., సంగీత దర్శకుడు కమలాకర్, నటులు రాము, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కమలాకర్ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. శ్రీమణి నాలుగు పాటలను చాలా అద్భుతంగా రాశాడు. ఈరోజు 'ఏమైందో..' పాటను నందినిరెడ్డిగారు రిలీజ్ చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. రామ్మోహన్‌గారు మంచి టేస్ట్ వున్న నిర్మాత. ఇది చాలా సహజంగా వుండే కథ. నాకు బాగా నచ్చింది. రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రతి ఒక్కరి జీవితానికి చాలా దగ్గరగా వుండే కథ ఇది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ - ''ఉయ్యాలా జంపాలా చిత్రానికి వర్క్ చేశాను. నిర్మాత రామ్మోహన్‌గారితో అప్పటి నుంచి మంచి పరిచయం వుంది. మా టౌన్‌లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌తో ఈ కథను చేశాను. రామ్మోహన్‌గారికి, సురేష్‌బాబుగారికి ఈ కథ బాగా నచ్చింది. సినిమా బాగా వచ్చింది. కమలాకర్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన చేసిన రీరికార్డింగ్‌తో నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్ళారు. నన్ను ఎంకరేజ్ చేస్తున్న రామ్మోహన్‌గారికి, సురేష్‌బాబుగారికి థాంక్స్. డిసెంబర్ రెండో వారంలో ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
నందినిరెడ్డి మాట్లాడుతూ - ''రామ్మోహన్‌గారు నాకు మంచి ఫ్రెండ్. టేస్ట్ వున్న ప్రొడ్యూసర్. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించారు. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ మంచి సబ్జెక్ట్స్‌తో సినిమాలు తీస్తారు. అనుదీప్ చెప్పిన స్టోరీ విని చాలా ఎక్సైట్ అయ్యాను. పాటలు చాలా బాగున్నాయి. అన్‌వాంటెడ్ కామెడీ, నాలుగు పాటలు, ఫైట్స్‌తో కాకుండా ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. నలుగురు కుర్రాళ్ళ మధ్య జరిగే నేచురల్ ఇన్సిడెంట్స్‌తో అందరూ ఎంజాయ్ చేసే విధంగా తీశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
విశ్వదేవ్ రాచకొండ హీరోగా, పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్ రాజు, శివ ఆర్.ఎస్., శ్రీకాంత్ ఆర్.ఎన్. ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: 'ప్రాణం' కమలాకర్, నిర్మాతలు: దినేష్‌కుమార్, రామ్మోహన్ పి., దర్శకత్వం: అనుదీప్ కె.వి.