మెగా కాంపౌండ్‌లో నందిని
- IndiaGlitz, [Saturday,December 07 2019]
మెగా కాంపౌండ్ ఇప్పుడు పర్ఫెక్ట్ యూనివర్శిటీలాగా కనిపిస్తోంది మేకర్స్ కి. అక్కడ ఫ్రెషర్స్ ఉంటారు. సీనియర్లుంటారు... ప్రొఫెసర్లుంటారు అన్నట్టుంది పరిస్థితి. సరైన కథతో గేట్ తట్టాలేగానీ, ఆ కాంపౌండ్‌లో ఎక్కడో ఎవరికో సరిపోకమానదంటున్నారు రైటర్స్. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కాంపౌండ్‌లో అడుగుపెడుతోంది నందినిరెడ్డి. రీసెంట్ గా ఓ బేబీ చేసింది నందినీరెడ్డి. ఆ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో ఇప్పుడు కొత్త కథను సిద్ధం చేసుకుంది నందిని. ఆ గ్యాప్‌లో లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్‌లో ఒక పార్ట్ ను అమలాపాల్, జగపతిబాబు తో డైరక్ట్ చేసేసింది.
త్వరలోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో సినిమా చేయనుందట నందినిరెడ్డి. వైష్ణవ్ ఇప్పుడు ఉప్పెన సినిమాతో బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ ఇది. ఈ మూవీ తర్వాత స్వప్న సినిమాస్ నందిని - వైష్ణవ్ మూవీని రూపొందించనున్నారు. అన్నీ కరెక్ట్ గా కుదిరితే పొంగల్ తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందట. ప్రస్తుతం నందిని లొకేషన్ల వేటలో ఉన్నారు.