నందినీ రాయ్ సూసైడ్ స్టోరీ

  • IndiaGlitz, [Tuesday,June 23 2020]

సెలబ్రిటీ హోదా రాగానే బాధ్యత పెరుగుతుంది. దాని వల్ల తెలియకుండా ఇన్ సెక్యూరిటీ పెరుగుతుంది. ప్రతి శుక్రవారం స్టార్ డమ్ చేంజ్ అయిపోతుంటుంది. అని అంటుందీ హీరోయిన్ నందినీ రాయ్. మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి చిత్రాల్లో నందనీ రాయ్ హీరోయిన్ గా నటించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినీ స్టార్స్ విషయానికి వస్తే.. హిట్ ప్లాపులను బట్టి కెరీర్ మారిపోతుంటుంది. ఇవన్నీ మనలో తెలియలేని డిప్రెషన్ ను పెంచుతాయి. రెండేళ్ల ముందు నేను కూడా డిప్రెషన్ లో ఉన్నాను. సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయి. అపోలో హాస్పిటల్ లో ఇద్దరు సైక్రియాటిస్టులను కలిసి ట్రీట్ మెంట్ తీసుకోవడం వల్ల మళ్లీ మామూలు మనిషిగా మారాను.

డిప్రెషన్ అనేది ఛాయిస్ కాదు. మనకు తెలియకుండా మన ఆలోచన శైలి మారిపోతుంటుంది. మనిషి తనకు తానుగా అందరికీ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఎవరినీ కలవాలని అనుకోరు. ఎక్కువగా నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి మానసిక ఒత్తిడి నుండి మనుషులు బయటపడటానికి కుటుంబమే కీలకంగా ఉంటుంది. అందరూ తమ డిప్రెషన్ గురించి బయటకు చెప్పాలి. ఉదాహరణకు దీపికా పదుకొనె కూడా తను డిప్రెషన్ కు గురైన సంగతిని తెలియజేశారు. నేను కూడా బిగ్ బాస్ సమయంలో డిప్రెషన్ గురించి ఓపెన్ గా మాట్లాడాను. అందరూ ఓపెన్ గా మాట్లాడితే మంచిది. దాని వల్ల మన సమస్యలు ఏంటో అందరికీ తెలుస్తాయి’’ అన్నారు.

More News

‘హిర‌ణ్య’ ప్రీ ప్రొడ‌క్ష‌న్ పూర్తి.. హీరో మారుతాడా?

భారీ సెట్స్ వేసి సినిమాలు చేయడంలో డైరెక్టర్ గుణశేఖర్ దిట్ట‌. ఈయ‌న తెర‌కెక్కించిన గ‌త చిత్రం రుద్ర‌మ‌దేవి.

ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం.. భారతీయులకే అధిక నష్టం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ‘హైర్‌ అమెరికన్‌’ నినాదంలో భాగంగా విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్‌1-బీ, ఎల్‌1,

మ‌హేశ్‌కు శ‌ర్వా ఓకే చెబుతాడా?

నేటి త‌రం అగ్ర హీరోల్లో ఎన్టీఆర్ మిన‌హా దాదాపు అంద‌రూ నిర్మాత‌లుగా మారిన వారే.

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న న‌భా న‌టేశ్‌

న‌న్నుదోచుకుందువ‌టే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన హీరోయిన్ న‌భా న‌టేశ్. త‌ర్వాత మంచి అవ‌కాశాల‌నే ద‌క్కించుకుంది.

ఇకపై మన ఆర్మీ, పోలీసులను అలా పిలవండి: పరేష్ రావెల్

సమాజంలో నిజమైన హీరోలు ఆర్మీ, పోలీసులేనని.. ప్రముఖ నటుడు పరేష్ రావెల్ తెలిపారు.