నందినీ రాయ్ సూసైడ్ స్టోరీ
Send us your feedback to audioarticles@vaarta.com
సెలబ్రిటీ హోదా రాగానే బాధ్యత పెరుగుతుంది. దాని వల్ల తెలియకుండా ఇన్ సెక్యూరిటీ పెరుగుతుంది. ప్రతి శుక్రవారం స్టార్ డమ్ చేంజ్ అయిపోతుంటుంది. అని అంటుందీ హీరోయిన్ నందినీ రాయ్. మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి చిత్రాల్లో నందనీ రాయ్ హీరోయిన్ గా నటించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినీ స్టార్స్ విషయానికి వస్తే.. హిట్ ప్లాపులను బట్టి కెరీర్ మారిపోతుంటుంది. ఇవన్నీ మనలో తెలియలేని డిప్రెషన్ ను పెంచుతాయి. రెండేళ్ల ముందు నేను కూడా డిప్రెషన్ లో ఉన్నాను. సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయి. అపోలో హాస్పిటల్ లో ఇద్దరు సైక్రియాటిస్టులను కలిసి ట్రీట్ మెంట్ తీసుకోవడం వల్ల మళ్లీ మామూలు మనిషిగా మారాను.
డిప్రెషన్ అనేది ఛాయిస్ కాదు. మనకు తెలియకుండా మన ఆలోచన శైలి మారిపోతుంటుంది. మనిషి తనకు తానుగా అందరికీ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఎవరినీ కలవాలని అనుకోరు. ఎక్కువగా నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి మానసిక ఒత్తిడి నుండి మనుషులు బయటపడటానికి కుటుంబమే కీలకంగా ఉంటుంది. అందరూ తమ డిప్రెషన్ గురించి బయటకు చెప్పాలి. ఉదాహరణకు దీపికా పదుకొనె కూడా తను డిప్రెషన్ కు గురైన సంగతిని తెలియజేశారు. నేను కూడా బిగ్ బాస్ సమయంలో డిప్రెషన్ గురించి ఓపెన్ గా మాట్లాడాను. అందరూ ఓపెన్ గా మాట్లాడితే మంచిది. దాని వల్ల మన సమస్యలు ఏంటో అందరికీ తెలుస్తాయి’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout