సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా నందిని నర్సింగ్ హోమ్ ఫస్ట్ లుక్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల మనవడు నవీన్ హీరోగా గిరి తెరకెక్కించిన చిత్రం నందిని నర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్కడ అంతా క్షేమము అనేది ట్యాగ్ లైన్. నవీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా నటించిన నందిని నర్సింగ్ హోమ్ ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల లాంఛ్ చేసారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ....మా ఫ్యామిలీ నుంచి వచ్చిన సెకండ్ జనరేషన్ సక్సెస్ అయ్యారు. థర్డ్ జనరేషన్ లో నవీన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. తొందర పడకుండా కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఏక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. నవీన్ కి మంచి భవిష్యత్ ఉంది. ఈనెల 27న మహేష్ చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
విజయనిర్మల మాట్లాడుతూ...నవీన్ నేచురల్ ఆర్టిస్ట్. హీరోయిన్ నిత్య బాగుంది. ఈ చిత్రాన్ని ఆదరించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో నవీన్ మాట్లాడుతూ...గిరి చాలా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టాకీ పూర్తి అయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతుంది. క్యూట్ లవ్ స్టోరీ ఇది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
నిర్మాత రాధా కిషోర్ మాట్లాడుతూ...పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
నవీన్, నిత్య, శ్రావ్య, షకలక శంకర్, సప్తగిరి, వెన్నెల కిషోర్, తమిళ జయప్రకాష్, సంజయ్ స్వరూప్, మాధవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - అచ్చు, ఎడిటింగ్ - కార్తీక శ్రీనివాస్, డిఓపి - దాశరథి శివేంద్ర, పాటలు - రెహమాన్, మాటలు - పి.వి.గిరి, సురేష్, నిర్మాత - రాధాకిషోర్.జి, భిక్షమయ్య సంగం, కథ - స్ర్కీన్ ప్లే - దర్శకత్వం - పి.వి.గిరి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments