ఇన్‌టెన్స్‌గా ‘నాంది’ టీజర్

  • IndiaGlitz, [Tuesday,June 30 2020]

కామెడీ స్టార్‌గా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించిన అల్ల‌రి న‌రేశ్ మ‌ధ్య మ‌ధ్య‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గ‌మ్యం, మ‌హ‌ర్షి వంటి డిఫ‌రెంట్ సినిమాల‌ను ట్రై చేస్తూనే ఉన్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌న్నింటికీ డిప‌రెంట్‌గా న‌రేశ్ చేసిన మ‌రో ప్ర‌య‌త్న‌మే ‘నాంది’. న‌రేశ్ న‌టిస్తోన్న 57వ చిత్రమిది. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌రేశ్ పుట్టిన‌రోజు(జూన్ 30) సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది.
హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

‘దేశ‌వ్యాప్తంగా 2015 నాటికి 29 రాష్ట్రాల్లో 1401 జైళ్లు ఉన్నాయి. 3, 66, 781 మంది ఖైదీలు ర‌క‌రాలుగా శిక్ష‌లు అనుభ‌విస్తున్నారు. అందులో దాదాపుగా 2,50,000 త‌ప్పు చేశామో, చేయ్య‌లేదో తెలియ‌కుండా అండ‌ర్ ట్రైల్ ఖైదీలుగా శిక్ష అనుభ‌విస్తున్నారు’ అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్‌...

‘జైలులోకి న‌రేశ్‌ను తీసుకురావ‌డం, అక్క‌డ నుండి త‌ను పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డం, పోలీసులు న‌రేశ్‌ను ర‌క్క‌మోడేలా చావ‌గొట్ట‌డం, మ‌ధ్య‌లో న‌రేశ్‌, ఖైదీల‌కు మ‌ధ్య గొడ‌వ‌, మ‌రో సీన్‌లో లాఠీలు విరిగేలా పోలీసులు న‌రేశ్‌ను చావ గొట్ట‌డం వంటి సీన్స్‌’తో కట్ చేశారు.

టీజర్‌లో న‌రేశ్ న‌గ్నంగా నిల‌బ‌డే సీన్‌ను బ్ల‌ర్ చేసి చూపించారు. చాలా ఇన్‌టెన్స్‌తో సాగే ఈ టీజ‌ర్ చాలా ఇన్‌టెన్స్‌గా సాగింది. ‘మ‌నిషి పుట్ట‌డానికి కూడా తొమ్మిది నెల‌లే టైమ్ ప‌డుతుంది. కానీ నాకు న్యాయం చెప్ప‌డానికేంటి సార్ ఇన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంది’ అనే డైలాగ్‌తో టీజ‌ర్ ముగుస్తుంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల బ్యాగ్రౌండ్ బావుంది.

More News

మ‌న‌ల్ని, మ‌న‌వారిని ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది:  మ‌హేశ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ క‌రోనా వ‌ల్ల ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయ్యారు.

త‌మ‌న్నా టాక్ షో..భారీ రెమ్యున‌రేష‌న్‌!!

ఆహాను తెలుగు వారికి మ‌రింత చేరువ చేయ‌డానికి అల్లు అర‌వింద్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు.

వ‌కీల్‌సాబ్‌కు త‌ప్ప‌ని లీకుల స‌మ‌స్య‌

సినిమా రంగానికి ఇప్పుడు క‌రోనా స‌మ‌స్య పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అయితే క‌రోనా కంటే ముందే సినీ ప‌రిశ్ర‌మ‌ను ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధాన‌మైన పైర‌సీ కాగా..

అప్ప‌టి వ‌ర‌కు ముద్దుల‌కు దూరం: రెజీనా

తాను ఇప్పుడు ముద్దుల‌కు దూరం అని అంటోంది చెన్నై బ్యూటీ రెజీనా క‌సాండ్ర‌. క‌రోనా ప్ర‌భావంతో సినీ పరిశ్రమ‌లో పెను మార్పులే చోటు చేసుకుంటున్నాయి.

నేను క్షేమంగానే ఉన్నాను:  ఎస్‌.జాన‌కి

ఆదివారం సాయంత్రం సంగీత ప్రేమికుల‌ను క‌ల‌వ‌ర పెట్టే వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది.