నంది అవార్డు చిత్రం దర్శకుడి కొత్త చిత్రం

  • IndiaGlitz, [Wednesday,July 24 2019]

గతంలో నంది అవార్డు పొందిన చిత్రం హితుడు. కె.ఎస్.వి. పతాకంపై విడుదలైన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అందులో నక్సలైట్ పాత్రలో జగపతిబాబు, నటి మీరనందన్ తన పాత్రలో ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్ర దర్శకుడైన కె.విప్లవ్ ఇప్పుడు నూతన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కేఎస్వీ సమర్పణలో సిరంజ్ సినిమా పతాకంపై ఓ సున్నితమైన ప్రేమకథాచిత్రంగా ఆయన దీనిని మలచనున్నారు.

ప్రేమకు రెయిన్ చెక్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన అభిలాష్, అరవింద సమేత, మిస్టర్ మజ్ను వంటి చిత్రాల్లో నటించిన రాఘవ్ కథానాయకులుగా ఈ చిత్రానికి ఎంపికయ్యారు. ఈ తరం యువత జీవనశైలికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందని, ఆద్యంతం మనసును రంజింపజేసే సన్నివేశాలతో పాటు ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు దర్శకుడు కె.విప్లవ్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న స్క్రిప్టు పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ- కేఎస్వీ.

More News

కొత్తోళ్లొద్దు.. పాతోళ్లే ముద్దంటున్న మాటల మాంత్రికుడు!!

సినీ ఇండస్ట్రీలోకి ఎందరో నటీనటులు వస్తుంటారు.. పోతుంటారు. సినిమాలుంటే పండుగ లేకుంటే అంతే సంగతులు ఇంటికే పరిమితం కావాల్సిందే మరి. అయితే ఈ జనరేషన్ గురించి చెబితే ఎంత మంది హీరోహీరోయిన్లు

పెళ్లిపై సల్లుభాయ్ సిల్లీ సమాధానం!!

ఇండియా మొత్తమ్మీద మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

అసెంబ్లీలో అడ్డంగా బుక్కయిన వైసీపీ ఎమ్మెల్యే!!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. గత రెండ్రోజులుగా ప్రధాన, చారిత్రక బిల్లులపై కీలక చర్చ జరుగుతోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ `హీరో` ఆగిందా?

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరో. త‌ను ఏ సినిమా అయినా నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేసేలానే ప్లాన్ చేసుకుంటున్నాడు.

కేటీఆర్ బర్త్ డే: సినీ, రాజకీయ ప్రముఖుల విషెస్

గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (తారక రాముడు) పుట్టిన రోజు నేడు.