ఆర్యకి డబ్బింగ్ చెప్పిన...
Send us your feedback to audioarticles@vaarta.com
పివిపి బ్యానర్ పై ఆర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సైజ్ జీరో`. సోనాల్ చౌహాన్ ప్రధానపాత్రలో నటిస్తుంది. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ప్రస్తుతం సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది.
తెలుగులో ఆర్యకి యంగ్ హీరో నందు డబ్బింగ్ చెప్పినట్టు లేటెస్ట్ సమాచారం. ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్, మూవీ అక్టోబర్ లో విడుదల కావాల్సింది. అయితే అనుకోని కారణాలతో అవి పోస్ట్ ఫోన్ అయ్యాయి. ఈ సినిమాలో అనుష్క డిఫరెంట్ రోల్ చేసింది. పాత్ర కోసం ఇరవై కేజీల బరువు పెరిగింది. వెయిట్ లాస్ కి సంబంధించిన కామెడి చిత్రంగా సినిమా రూపొందింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments