రాజా మీరు కేక లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న నందమూరి హీరో..!

  • IndiaGlitz, [Friday,January 06 2017]

ఆర్.కె స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజా మీరు కేక. ఈ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తూ యాంక‌ర్ లాస్య తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతుంది. రేవంత్, నోయెల్, మిర్చి హేమంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్ణ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో
రాజ్ కుమార్ ఎం నిర్మిస్తున్నారు.
విభిన్న క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నందమూరి తారకరత్న ఒక టెర్రిఫిక్ రోల్ చేస్తున్నారు. ఎటువంటి పాత్రకైనా న్యాయం చేయడంలో నందమూరి ఫ్యామిలీ వారి డెడికేష‌నే వేరు. పతాక సన్నివేశాల్లో తారకరత్న ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా నటించారు అని చిత్ర నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి డిఓపి : రామ్ పి రెడ్డి, సంగీతం: శ్రీచరణ్, ఆర్ట్: మారేష్ శివన్, స్టంట్స్: జాషువ. నిర్మాత - రాజ్ కుమార్, ద‌ర్శ‌క‌త్వం క్రిష్ణ కిషోర్.

More News

జనవరి 7, 8 తేదీల్లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ నైజాం టూర్

టాలీవుడ్ స్టార్ కమీడియన్ సప్తగిరి హీరో లాంఛింగ్ సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ బాక్సాఫీస్ పై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సెన్సార్ పూర్తి..!

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యానర్ పై జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ న‌టించింది.

ఖైదీ నెం 150 మేకింగ్ రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప్రెస్టేజీయ‌స్ మూవీ ఖైదీ నెం 150. మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ఈ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్నినిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేసిన ఖైదీ నెం 150 టీమ్ ఈరోజు మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ఫ్రేమ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ ప్రెస్టేజీయ‌స్ మూవీని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

ఆరోజు చైతు మ‌ర‌చిపోలేని రోజు..!

అక్కినేని నాగ‌చైత‌న్య జీవితంలో జ‌న‌వ‌రి 29 మ‌ర‌చిపోలేని రోజుగా మార‌బోతుంది అట‌. ఇంత‌కీ విశేషం ఏమిటి అనుకుంటున్నారా..?  ఒక‌టి కాదు రెండు విశేషాలు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.