Taraka Ratna:రాత్రికి హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం.. ఎల్లుండి ఫిల్మ్‌ఛాంబర్‌కు , అదే రోజు అంత్యక్రియలు
Send us your feedback to audioarticles@vaarta.com
సినీనటుడు నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తారని భావిస్తున్న వేళ తారకరత్న తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయలో వున్న తారకరత్న భౌతికకాయాన్ని రాత్రికి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. అనంతరం రేపు మోకిలలోని ఆయన స్వగృహానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఎల్లుండి ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న పార్థివ దేహాన్ని తరలిస్తారు. అనంతరం సోమవారం సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.
23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం:
అక్కడ ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. రెండు రోజుల క్రితం కూడా బ్రెయిన్ స్కాన్ తీశారు వైద్యులు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన ఆరోగ్యం విషమించింది. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com