Taraka Ratna:రాత్రికి హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం.. ఎల్లుండి ఫిల్మ్‌ఛాంబర్‌కు , అదే రోజు అంత్యక్రియలు

  • IndiaGlitz, [Sunday,February 19 2023]

సినీనటుడు నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తారని భావిస్తున్న వేళ తారకరత్న తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయలో వున్న తారకరత్న భౌతికకాయాన్ని రాత్రికి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. అనంతరం రేపు మోకిలలోని ఆయన స్వగృహానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఎల్లుండి ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న పార్థివ దేహాన్ని తరలిస్తారు. అనంతరం సోమవారం సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.

పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:

కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం:

అక్కడ ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. రెండు రోజుల క్రితం కూడా బ్రెయిన్ స్కాన్ తీశారు వైద్యులు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన ఆరోగ్యం విషమించింది. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

More News

Taraka Ratna: నందమూరి కుటుంబంలో మరో విషాదం.. తారకరత్న అస్తమయం, 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం

నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీనటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు.

Venky Atluri:మనసున్న ప్రతి మనిషికి నచ్చే సినిమా 'సార్' - దర్శకుడు వెంకీ అట్లూరి

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు)/‌ 'వాతి'(తమిళం).

Taraka Ratna:అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం, బెంగళూరుకు బాలయ్య.. కాసేపట్లో హెల్త్ బులెటిన్

గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతోన్న సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం

Project K : పెద్ద చేయి, గన్స్‌ పట్టుకున్న వ్యక్తులు.. ప్రభాస్ ‘‘ప్రాజెక్ట్‌ కే ’’ కొత్త పోస్టర్ వైరల్, రిలీజ్ ఎప్పుడంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అర్జెంట్‌గా ఓ హిట్టు కావాలి. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు పరిశ్రమను తీవ్రంగా నిరాశపరిచాయి.

IPL 2023 : మార్చి 31 నుంచి ఐపీఎల్.. తొలి మ్యాచ్‌లో‌ తలపడనున్న చెన్నై-గుజరాత్, షెడ్యూల్ ఇదే

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -2023 సంబంధించి బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించింది.