Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్ ' రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడంటే హీరోలంతా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు కానీ.. ఈ విషయంలో అందరికంటే ముందే వున్నారు నందమూరి కళ్యాణ్‌రామ్. కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఆయనది అదే పంథా. హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వెరైటీ కథలు చేసుకుంటూ పోతున్నారు ఈ నందమూరి వారి అబ్బాయి. గతేడాది బింబిసారతో తన కెరీర్‌లోనే తిరుగులేని హిట్ సొంతం చేసుకున్నారాయన. అంతేకాదు.. కరోనాతో థియేటర్ వైపు రావడం మానేసిన ప్రేక్షకుడిని తిరిగి రప్పించడంలో తన వంతు పాత్ర పోషించారు కళ్యాణ్‌రామ్.
డెవిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన :
బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం ‘‘డెవిల్’’. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈయన బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నారు. భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న సమయం నాటి కథతో డెవిల్ రూపుదిద్దుకుంటోందని ఫిలింనగర్ టాక్. రీసెంట్‌గా విడుదలైన డెవిల్ గ్లింప్స్‌లో కథ గురించి ఏమాత్రం చెప్పకుండా హీరో ఎలాంటి వాడు, ఆయన స్టైల్, లుక్ పరిచయం చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి చిత్ర యూనిట్ నుంచి అప్‌డేట్ వచ్చింది. నవంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో డెవిల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది.
కళ్యాణ్ రామ్ నుంచి మరో హిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తోన్న ఫ్యాన్స్ :
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా డెవిల్‌ను నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కథ , స్క్రీన్ ప్లే , మాటలను శ్రీకాంత్ విస్సా అందిస్తుండగా.. హర్షవర్థన్ రామేశ్వర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్‌కు జంటగా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే గోల్డెన్ హ్యాండ్‌గా ముద్ర తెచ్చుకున్న ఈ భామ .. తమ హీరోకు కూడా మంచి హిట్ ఇవ్వాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments