నందమూరి కళ్యాణ్ రామ్ - కాజల్ అగర్వాల్ ల నూతన చిత్రం 'MLA' ప్రారంభం

  • IndiaGlitz, [Monday,June 05 2017]

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ 'MLA'. "మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్" అనేది కాప్షన్. ఈ చిత్రం లో అందాల భామ కాజల్ హీరోయిన్ గా కనిపించనున్నారు.

T.G. విశ్వప్రసాద్ సమర్పణ లో ,బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బ్యానర్ ల సంయుక్త నిర్మాణం లో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తారు.

ఈ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయి బాబా దేవస్థానం లో జరిగింది. హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, దర్శకులు ఉపేంద్ర మాధవ్, కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల, నిర్మాతలు C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి కుటుంబ సమేతం గా పాల్గొన్న ఈ కార్యక్రమం యూనిట్ సభ్యుల మధ్య జరిగింది.

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తనయుడు సౌర్యా రామ్ మరియు నిర్మాత భరత్ చౌదరి తనయుడు కరణ్ ఈ చిత్రానికి క్లాప్ ఇవ్వగా, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కూతురు తారక అద్విత మరియు నిర్మాత M. V. కిరణ్ రెడ్డి కూతురు ఐక్రా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దేవుడి పఠాల మీద చిత్రీకరించిన మొదటి షాట్ కు ప్రముఖ రచయిత కోనా వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు.

"ఆధ్యంతం వినోదభరితం గా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర రాసుకున్న కథ చాలా ఫ్రెష్ గా ఉంది. జూన్ 9 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం చివరి భాగం లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం", అని నిర్మాతలు తెలిపారు.

" టోటల్ న్యూ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా లో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారి కి, చిత్ర నిర్మాతల కి కృతఘ్నతలు తెలుపుతున్నా. MLA అనే టైటిల్ కి, కాప్షన్ కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది", అని దర్శకులు ఉపేంద్ర అన్నారు.

రవి కిషెన్, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రం లో ని ప్రధాన నటులు. ఇతర నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుపుతాము అని యూనిట్ సభ్యులు తెలిపారు.

ఈ చిత్రానికి సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ, సంగీతం: మని శర్మ , సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్‌: తమ్మిరాజు , సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల , నిర్మాతలు : C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.

More News

'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' సక్సెస్ మీట్

వంశీ వంటి లెజెండ్రీ డైరెక్టర్తో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన నేటి తరం వారికి పోటీగా ఉన్నారు. ఆయనతో పోటీ పడుతూ పనిచేయడానికి అందరూ చాలా కష్టపడాల్సి వచ్చింది.

'లవ్లీ' కంటే 'వైశాఖం' పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్

ఒక చిన్న సినిమా టీజర్ కి 2.5 మిలియన్ వ్యూస్ రావడమనేది మామూలు విషయం కాదు.'వైశాఖం' అనే మంచి తెలుగు టైటిల్ తో డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయనే దానికి యూ ట్యూబ్లో వచ్చిన వ్యూసే నిదర్శనం.

విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న పూజాకుమార్...

న్యూక్లియర్ సైన్స్ చదువుకున్న గృహిణి పాత్రలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో విశ్వరూపంలో

'విఐపి2' టీజర్ రిలీజ్ డేట్

ధనుష్ హీరోగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో కలైపులి థాను వి.ఐ.పి2 చిత్రాన్ని

డి.రామానాయకుడు జయంతి సందర్భంగా విడుదలకానున్న 'నేనే రాజు నేనే మంత్రి' టీజర్

జూన్ 6వ తేదీ దగ్గుబాటి వంశీయులకు మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకమైన రోజు.