మెగా హీరోలతో పాటు నందమూరి హీరో కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్...ఈ ముగ్గురు తమ చిత్రాలను ఈనెల 29న ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు మెగా హీరోలతో పాటు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా అదే రోజు కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించే ఈ చిత్రాన్నిఈ నెల 29న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను మేలో స్టార్ట్ చేయనున్నారు. కళ్యాణ్ రామ్ ని సరికొత్తగా చూపించే ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com