ఒకే రహదారి.. నందమూరి హరికృష్ణ ఫ్యామిలీ
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని ఘటనలు యాదృచ్చికంగా జరిగినా.. అనుకోని లింక్ ఏదో కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తావించదగ్గ విషయం కాకున్నా.. ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. విషయమేమంటే నేడు ఉదయం నల్గొండ జిల్లా అన్నేపర్తిలో జరిగిన కారు ప్రమాదంలో టీడీపీ నాయకుడు, సీనియర్ నటుడు నందమూరి హరికృష్ణ చనిపోయారు. నందమూరి అభిమాని కొడుకు పెళ్లికి వెళ్తున్న తరుణంలో పక్కనున్న కారును ఓవర్ టేక్ చేయబోయి కారు ప్రమాదానికి గురైంది.
ఆ ప్రమాదంలో హరికృష్ణ తల, చాతికి బలమైన గాయలైయాయి. ఈ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. విజయవాడ నేషనల్ హైవేలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ విజయవాడ నేషనల్ హైవే.. నందమూరి ఫ్యామిలీకి జరిగిన ప్రమాదాలకు ఏదో రకంగా లింక్ ఉంటూనే ఉంది. 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ప్రచారానికి వెళ్లి హైదరాబాద్ వస్తున్న క్రమంలో సూర్య పేట దగ్గరలోని మొటే గ్రామం వద్ద పెద్ద ప్రమాదమే జరిగింది. అదృష్టవశాతు ఎన్టీఆర్ గాయాలతో బయటపడ్డారు. దాదాపు మూడు నెలలు పాటు ఆయన బెడ్‌పైనే ఉండాల్సి వచ్చింది.
ఇదే విజయవాడ నేషనల్ హైవేపై 2014లో నల్గొండ జిల్లా ఆకులపర్తి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద తనయుడు నందమూరి జానకిరాం కన్నుమూశారు. ఇలా నందమూరి ఫ్యామిలీలో..ముఖ్యంగా నందమూరి హరికృష్ణ ఫ్యామిలీలో ముగ్గురు వ్యక్తులు.. విజయవాడ రహదారిలో నల్గొండ సమీపంలో కారు ప్రమాదాలకు గురయ్యారు. అందులో ఎన్టీఆర్ గాయాలతో బయటపడగా.. జానకిరామ్ ఇప్పుడు హరికృష్ణ ప్రమాదంలో కన్నుమూశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments