నంద‌మూరి హ‌రికృష్ణ దుర్మ‌ర‌ణం

  • IndiaGlitz, [Wednesday,August 29 2018]

న‌టుడు, నిర్మాత, టీడీపీ నేత‌ నంద‌మూరి హ‌రికృష్ణ న‌ల్గొండ జిల్లా అన్నేప‌ర్తిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. ఈరోజు ఉద‌యం అతివేగంగా వ‌స్తున్న ఆయ‌న కారు రోడ్డు డివైడ‌ర్‌ను ఢీకొట్టి ప‌ల్టీలు కొట్టింది. ప్ర‌మాదంలో హ‌రికృష్ణ రోడ్డు ప‌క్క‌న ప‌డి ఉండ‌గా గుర్తించిన స్థానికులు నార్క‌ట్‌ప‌ల్లి స‌మీపంలోని కామినేని హాస్పిట‌ల్‌కు చేర్చారు. చికిత్స చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఆయ‌న క‌న్నుమూశారు. హ‌రికృష్ణే స్వ‌యంగా న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం. హ‌రికృష్ణ మృతితో టీడీపీ వ‌ర్గాలు.. నంద‌మూరి అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.