మోక్ష‌జ్ఞ రీసెంట్ ఫొటోతో నంద‌మూరి అభిమానులు షాక్‌!

  • IndiaGlitz, [Saturday,November 30 2019]

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. మోక్ష‌జ్ఞ ఎంట్రీపై సోష‌ల్ మీడియాలో ఏదో ర‌కంగా వార్త‌లు విన‌ప‌డుతూనే వ‌స్తున్నాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. అయితే అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న మోక్ష‌జ్ఞ ఫొటోలు నందమూరి అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయ‌ట‌. రీసెంట్‌గా విడుద‌లైన బాల‌కృష్ణ ఫ్యామిలీ ఫొటోలో మోక్ష‌జ్ఞ కూడా ఉన్నాయి. అందులో మోక్ష‌జ్ఞ బొద్దుగా క‌న‌ప‌డుతున్నాడు. మోక్ష‌జ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డంపై అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణంలో మోక్ష‌జ్ఞ లుక్ అంద‌రిలో కంగారెత్తిస్తుంది.

సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌యుడిగా బాల‌కృష్ణ హీరోగా వార‌సత్వాన్ని కొన‌సాగిస్తున్నారు. త‌ర్వాత చాలా మంది హీరోలు వ‌చ్చినా జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే అగ్ర హీరోగా నిల‌బ‌డ్డారు. తాజాగా ఇప్పుడు మ‌రో త‌రంలో హీరోల కోసం నంద‌మూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణంలో అంద‌రూ మోక్షజ్ఞపైనే అంచ‌నాలు పెట్టుకున్నారు. మ‌రి మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడో బాల‌కృష్ణ ఖరారు చేస్తాడు. వ‌చ్చే ఏడాది మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉండొచ్చున‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

More News

'అశ్వథామ' మోషన్ పోస్టర్ విడుదల

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం `అశ్వథ్థామ`. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

షూటింగ్ ముగించుకున్న'ప్రతి రోజు పండగే' బృందం

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా,  మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా,

ఫ్యాంట‌సీ క‌థ‌తో నిఖిల్‌?

యువ హీరో నిఖిల్ త్వ‌ర‌లోనే ఓ ఫ్యాంట‌సీ సినిమాలో న‌టించ‌బోతున్నాడని సినీవ‌ర్గాల స‌మాచారం.

ఆ విష‌యంలో క‌ల్యాణ్‌రామ్‌కి క‌ష్టంగా ఉందా?

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తొలిసారి సంక్రాంతి సంద‌ర్భంగా `ఎంత‌మంచివాడ‌వురా` అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

బంగారు కోడిపెట్టలతో స్టెప్పులు ఇరగదీసిన చిరు!

అవును.. బంగారు కోడిపెట్టలతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు ఇరగదీశారు. ఇంతకీ బంగారు కోడిపెట్టలు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా..?