NBK 108: సంపత్ నంది దర్శకత్వంలో బాలయ్య.. మాస్ మెచ్చే ఫార్ములాతో స్క్రిప్ట్ రెడీ...?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల విషయంలో కుర్ర హీరోల కంటే స్పీడ్‌గా వెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే అఖండను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. లాక్‌డౌన్ తర్వాత తెలుగు సినిమాకు గత వైభవం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని సినిమాలను పట్టాలెక్కించేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు. 'అఖండ' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నవంబర్ నెలలో పూజా కార్యక్రమాలు జరిగాయి. బాలయ్య కెరీర్‌లో అది 107వ సినిమా. దీని తర్వాత 108వ సినిమా ఎవరి దర్శకత్వంలో చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దర్శకుడు సంపత్ నందికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల వేములవాడలో తాను బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్లు సంపత్ నంది ప్రకటించారు. స్క్రిప్ట్ రెడీ అయ్యిందని, వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి పాదాల చెంత స్క్రిప్ట్ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన తెలిపారు. అయితే ఈ విషయంగా బాలకృష్ణ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. తాజాగా బాలయ్య- సంపత్ నంది మూవీకి ఓకే చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్.
రీసెంట్‌గా గోపిచంద్ హీరోగా తెరకెక్కిన సీటీమార్‌తో మంచి సక్సెస్ అందుకున్నాడు సంపత్ నంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన సిటీమార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అందుకుంది. తాజాగా బాలయ్య మూవీలో ఆయన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్, మాస్ అంశాలతో స్క్రీప్ట్ రెడీ చేసినట్లుగా తెలిసింది. కథలోని పాయింట్ కొత్తగా వుండటంతో బాలకృష్ణ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పారని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com