Nandamuri Balakrishna : #NBK 107 లొకేషన్ నుంచి సెల్ఫీ ... బాలయ్యతో అంటే ఇలా వుంటది మరి
Send us your feedback to audioarticles@vaarta.com
‘అఖండ’ సూపర్‌హిట్‌తో మంచి ఊపుమీదున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇదే స్పీడుతో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రంలో నటిస్తున్నాడు. బాలయ్య సరసన శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫారిన్‌లో జరుగుతోంది. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని.. షూటింగ్ లొకేషన్ నుంచి బాలయ్య, శృతీలతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఇందులో బాలయ్య అదిరిపోయే లుక్‌లో సెల్ఫీకి ఫోజివ్వగా.. శృతీహాసన్ కూడా బ్లాక్ కలర్ డ్రెస్‌లో విత్ స్మైల్‌తో ఆకట్టుకుంది.
దసరాకు #NBK 107 టీజర్..? :
మరోవైపు దసరా కానుకగా #NBK 107 నుంచి టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. గతంలో వచ్చిన గింప్స్‌ని మించి టీజర్ వుంటుందని టాక్. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించనున్నారు.
48 ఏళ్ల సినీ ప్రస్థానం:
ఇకపోతే.. నందమూరి బాలకృష్ణ నటుడిగా 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 14 వయసులో తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాలో బాలయ్య తొలిసారిగా నటించారు. 48 ఏళ్ల సినీ జీవితంలో 106 సినిమాల్లో నటించిన ఆయన 126 మంది హీరోయిన్స్‌తో ఆడిపాడారు. 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన సినిమాలు బాలయ్య కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఈ తరంలో సాంఘిక, జానపద, పౌరాణిక, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్సన్, బయోపిక్ వంటి అన్ని జోనర్స్‌లో నటించిన ఘనత బాలకృష్ణదే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com