తెలుగు సినీ పరిశ్రమ మంచి నిర్మాతనే కాదు, మంచి వ్యక్తిని కోల్పోయింది: బాలకృష్ణ

  • IndiaGlitz, [Sunday,February 26 2017]

''ప్ర‌ముఖ సినీ నిర్మాత కె.సి.శేఖ‌ర్ బాబు క‌న్నుమూయ‌డం చాలా బాధాక‌రం. నిర్మాత‌గా ఎన్నో మంచి చిత్రాల‌ను నిర్మించారు. ఆయ‌న నిర్మాణంలో నేను కూడా సాహ‌స సామ్రాట్ అనే సినిమా చేశాను. నాన్న‌గారు, స్వర్గీయ ఎన్టీఆర్‌గారితో సినిమా పరంగా ,కుటుంబ పరంగా కూడా త‌న తండ్రిగారి కాలం నుండి స‌త్సంబంధాలు ఉన్న వ్య‌క్తి శేఖ‌ర్‌బాబుగారు. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌తను సాధించుకున్న శేఖ‌ర్‌బాబుగారు ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్ గా, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీగా గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది ఫిలించాంబ‌ర్ క‌మిటీ మెంబ‌ర్ గా సేవ‌లందిస్తూ అంద‌రికీ అందుబాటులో ఉండి క‌ళామ‌తల్లికి సేవ చేసిన వ్య‌క్తి. శేఖ‌ర్ బాబుగారి మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ మంచి నిర్మాత‌నే కాదు, ఒక మంచి వ్య‌క్తిని కోల్పోయిన‌ట్ట‌య్యింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను'' --- నంద‌మూరి బాల‌కృష్ణ

More News

పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో సపోర్ట్ చేస్తాః నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు రాజకీయాల పరంగా తన సపోర్ట్ తన తమ్ముడికే ఉంటుందని చెప్పేశాడు.

దుబాయ్ వెళుతున్న జగన్నాథమ్...

ఆర్య,పరుగు సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,నిర్మాత దిల్రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం'డిజె దువ్వాడ జగన్నాథమ్'.

జవాన్ గా రానా...

రీసెంట్ గా ఘాజీ సినిమాతో సక్సెస్ అందుకున్నదగ్గుబాటి రానా,కెరీర్ తొలి నాళ్ళ నుండి విలక్షణ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు.

సునీల్ నిర్మాతపై కేసు నమోదు...

హీరో సునీల్ తో ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత పరుచూరి కిరిటీ.

సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్న యంగ్ హీరో...

సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో