Nandamuri Balakrishna : మరోసారి ‘‘సింహా’’ సెంటిమెంట్‌తో.. బాలయ్య NBK107 సినిమా టైటిల్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో నందమూరి బాలకృష్ణ స్పీడ్ ముందు కుర్ర హీరోలు కూడా సరిపోవడం లేదు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు బాలయ్య . ఈ ఏడాది ప్రారంభంలో అఖండతో టాలీవుడ్ రికార్డులు తిరగరాయడంతో పాటు తెలుగు చిత్ర సీమకు మళ్లీ ఊపిరి పోశారు. ఇక ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తనదైన శైలిలో గెస్ట్‌లను ప్రశ్నించే విధానం, అల్లరి, సరదా సంభాషణలతో ఆహా సబ్‌స్క్రైబర్స్, వ్యూయర్‌షిప్‌ను బాలయ్య ఎక్కడికో తీసుకెళ్లారు. ఇంతటి బిజీ షెడ్యూల్ మధ్య తనను గెలిపించిన హిందూపురం ప్రజల బాగోగులను కూడా తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారు.
టర్కీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలయ్య :
ఇకపోతే.. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఆయన కెరీర్‌లో 107వ చిత్రం. శృతీహాసన్ హీరోయిన్‌గా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ , ఫస్ట్ లుక్, బాలయ్య గెటప్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా పేరు మాత్రం ఇంత వరకు అనౌన్స్ చేయలేదు. NBK 107 వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఇటీవలే చిత్ర బృందం టర్కీ వెళ్లొచ్చింది.
తిరుగులేని సింహా సెంటిమెంట్:
అయితే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిమానులకు ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్. శుక్రవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. సినిమా పేరు ‘‘వీర సింహారెడ్డి’’గా ప్రకటించారు. ‘‘సింహా’’ పేరుతో వచ్చిన బాలకృష్ణ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో అభిమానులు ‘‘వీర సింహా రెడ్డి’’ కూడా హిట్ అవుతుందని నమ్మకంతో వున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com