Nandamuri Balakrishna : బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌‌కు తప్పిన ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • IndiaGlitz, [Saturday,January 07 2023]

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలు వేదికగా జరిగింది. శుక్రవారం రాత్రి నగరంలోనే బస చేసిన ఆయన.. శనివారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరారు. అయితే గాల్లోకి లేచిన 20 నిమిషాలకే చాపర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గురించారు. వెంటనే హెలికాఫ్టర్‌ను ఒంగోలులోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్‌లో ల్యాండ్ చేశారు. దీంతో బాలకృష్ణ (Nandamuri Balakrishna) రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయల్దేరినట్లుగా తెలుస్తోంది.

నా జీవితాశయం అదే : బాలయ్య

ఇకపోతే.. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బాలయ్య మాట్లాడుతూ.. చెంఘీజ్‌ఖాన్ సినిమా చేయాలన్నది తన జీవితాశయమన్నారు. సినిమాలకీ, రాజకీయాలకే పరిమితం అనుకున్నవాళ్లకి ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని బాలయ్య పేర్కొన్నారు. ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాల మాదిరిగానే వీరసింహారెడ్డి చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ఆకాంక్షించారు. శృతీహాసన్ అద్భుతమైన నటి అని.. ఆమె స్వయంకృషితో ఎదిగిందని బాలయ్య ప్రశంసించారు. దునియా విజయ్ అద్భుతంగా నటించి కన్నడ, తెలుగు స్నేహబంధానికి చిహ్నంలా నిలిచారని కొనియాడారు. హనీరోజ్‌కి తెలుగులో తొలి సినిమానే అయినా ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారని బాలకృష్ణ అన్నారు.

సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి:

ఇకపోతే.. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

More News

Veera Simha Reddy:‘‘ఒంటి చేత్తో ఊచకోత కోస్తా’’ బాలయ్య ఉగ్ర స్వరూపం.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న వీరసింహా రెడ్డి ట్రైలర్

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘వీరసింహారెడ్డి’’.

'కళ్యాణం కమనీయం' ట్రైలర్ విడుదల

యువ హీరో సంతోష్ శోభన్ (Santhosh Shoban)నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది.

Deepika Padukone: దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా 'ప్రాజెక్ట్ – కె' పోస్టర్‌ విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో

Veera Simhaa Reddy : బాలయ్యకు షాకిచ్చిన జగన్ సర్కార్.. ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌కు నో పర్మిషన్

నందమూరి బాలకృష్ణ (Balakrishna)హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఒంగోలులో

Anchor Shyamala : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తోన్న శ్యామల అందాలు .. ఆ చూపులకు మతిపోవాల్సిందే

సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న తెలుగు యాంకర్లలో శ్యామల ఒకరు. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లయినా శ్యామల (Shyamala) ఫిగర్‌లో కొంచెం కూడా మార్పు రాలేదు.