NBK107 : బ్లాక్ డ్రెస్‌లో .. మాస్‌లుక్‌లో నటసింహం, ఫ్యాన్స్‌కు పూనకాలే
Send us your feedback to audioarticles@vaarta.com
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మంచి జోష్‌లో వున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కరోనా, లాక్‌డౌన్ వంటి పరిస్ధితుల్లో కళతప్పిన తెలుగు సినిమా బాక్సాఫీసుకు మళ్లీ పండగ తెచ్చారు బాలయ్య. ఈ నేపథ్యంలోనే తన 107వ చిత్రాన్ని గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు.
ఇకపోతే.. సోమవారం ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. బ్లాక్ షర్ట్, లుంగీ కట్టుకొని నడుచుకొని వస్తోన్న బాలకృష్ణ స్టిల్ అదిరిపోతోంది. బొట్టు, గాగుల్స్ తో ఆయన మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం ఇదే గెటప్‌తో ఉన్న బాలయ్య లుక్ ఒకటి ఆన్‌లైన్‌లో లీకైంది. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న సర్కారు వారు పాటకు సంబంధించిన కళావతి పాట విడుదలకు ముందే నెట్‌లో చక్కర్లు కొట్టింది. ఈ భయంతో బాలయ్య నిర్మాతలు కూడా ఫస్ట్‌లుక్‌ను వేగంగా రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్ రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలు పోషిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా టాక్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments