Balakrishna:నా వాళ్లను నేను బాధపెడతానా .. మన్నిస్తారని ఆశిస్తున్నా : దేవ బ్రాహ్మణులకి బాలయ్య లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
దేవ బ్రహ్మాణులపై సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం రేగడంతో బాలయ్య స్పందించారు. ఆ మాటలు దురదృష్టవశాత్తూ అన్నానని.. తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే.. దేవ బ్రాహ్మణులు (దేవాంగులు)కు నాయకుడు రావణ బ్రహ్మా అని ఓ కార్యక్రమంలో బాలయ్య వ్యాఖ్యానించారు. అయితే దీనిపై దేవాంగులు భగ్గుమన్నారు. దేవ బ్రహ్మాణులకు దేవల మహర్షి గురువని అన్నారు. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. దేవాంగ కులానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బాలయ్య వ్యాఖ్యలపై మండిపడ్డ దేవాంగులు :
దీంతో బాలయ్య స్పందించారు. దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని తనకు తెలిసిన సమాచారం తప్పు అని తెలియజేసినందుకు దేవాంగులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదన్న సంగతి ప్రజలకు తెలుసునని బాలకృష్ణ పేర్కొన్నారు. తన పొరపాటును మన్నించాలని.. సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల తనకు కలిగే ప్రయోజనం ఏముంటుందన్నారు. దేవాంగులలో తన అభిమానులు చాలా మంది వున్నారని.. తన వాళ్లను తాను బాధపెట్టుకుంటానా అని బాలయ్య ప్రశ్నించారు.
బాలకృష్ణ డైలాగ్స్ జగన్‌ని ఉద్దేశించినవేనా :
ఇదిలావుండగా .. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ఈ నెల 12న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య నట విశ్వరూపంతో సినిమాను తన భుజాలపై మోశారు. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావులు కీలక పాత్ర పోషించారు. ఇక కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. అయితే వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ పేల్చిన డైలాగ్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com