NBK108 నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి న్యూ మూవీ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.
ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, కిలారు సతీష్, నిర్మాత శిరీష్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.
#NBK108 షూటింగ్ కూడా ఈ రోజు నుండే యాక్షన్ బ్లాక్ తో ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ బ్లాక్ కి వి వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మించారు.
బాలకృష్ణ మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను రాశారు.
ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయం.
#NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేయనున్నారు.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com