Bhagavant Kesari : భగవంత్ కేసరిగా నటసింహం.. ఇక మాస్ జాతరే, టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుగులేని విజయాలతో లేటు వయసులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డితో మరోసారి హిట్ అందుకున్నారు ఎన్బీకే. వీటికి తోడు టాక్ షోలు, ఐపీఎల్ కామెంటేటరీ, యాడ్ అండార్స్‌మెంట్స్‌తో బాలయ్య కెరీర్లోనే అత్యంత పీక్స్‌లో వున్నారు. వరుసగా వంద కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను అందుకుంటున్నాడు. ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలకృష్ణ తన 108వ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఇద్దరి సక్సెస్ ట్రాక్‌ను దృష్టిలో పెట్టుకుని బాలయ్య - అనిల్ రావిపూడి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
108 లోకేషన్లలో టైటిల్ పోస్టర్ రిలీజ్ :
ఇప్పటి వరకు NBK 108 వర్కింగ్ టైటిల్‌తో సినిమాను లాగిస్తున్నారు. మరి ఈ సినిమా పేరేంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సస్పెన్స్‌కు తెరదించింది చిత్ర యూనిట్. బాలయ్య గత చిత్రాల మాదిరే పవర్ ఫుల్ టైటిల్‌ను ఈ మూవీకి ఫిక్స్ చేశారు. అదే ‘‘భగవంత్ కేసరి’’. . ఐ డోంట్ కేర్ అనేది ట్యాగ్ లైన్. బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని 108 ప్రాంతాల్లో హోర్డింగ్స్ మీద టైటిల్ పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లో ఆయుధం పట్టుకుని, మోకాలిపై కూర్చొన్న నటసింహం శత్రువులపై దాడి సిద్ధంగా వున్నట్లుగా వుంది. ఇక ఎల్లుండి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. దీనిలో భాగంగా శనివారం భగవంత్ కేసరి టీజర్‌ను విడుదల చేయనున్నారు.
విజయదశమి కానుకగా భగవంత్ కేసరి :
కాగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భగవంత్ కేసరిని హరీష్ పెద్ది, సాహూ గార్లపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన తొలిసారిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆయన కుమార్తెగా శ్రీలీల కనిపించనున్నారు. ఈలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించనున్నారు. విజయదశమి కానుకగా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments