తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బాలయ్య ప్రశంసల వర్షం.. కానీ..!!!
Send us your feedback to audioarticles@vaarta.com
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన ‘‘అఖండ’’ సూపర్‌హిట్ కావడంతో చిత్ర యూనిట్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను చుట్టేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, పెదకాకాని శివాలయం, శ్రీకాళహస్తి, తిరుపతి క్షేత్రాలను సందర్శించారు. తాజాగా అఖండ టీమ్ యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు సోమవారం ఉదయం యాదాద్రి గుడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది బాలయ్య బృందానికి ఘనస్వాగతం పలికారు.
అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కేసీఆర్ చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. భక్తులు కూడా ఆలయ విశిష్టతను, స్వచ్ఛతను సంరక్షించాలని బాలయ్య కోరారు. దేశంలోని ఇతర ప్రాంతాల వారు సైతం వచ్చి దర్శనం చేసుకొనేలా ఆలయాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని స్వామివారిని కోరుకున్నట్లు బాలకృష్ణ చెప్పారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
అయితే.. ప్రస్తుతం ఏపీలో థియేటర్ల మూసివేత... సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం ఏ స్థాయిలో వివాదాస్పదమవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేచురల్ స్టార్ నాని హాట్ కామెంట్స్ తర్వాత.. సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ఏపీ ప్రభుత్వం విరుచుకుపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఏపీ- తెలంగాణ ప్రభుత్వాల మధ్య పోలికలు పెడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ గవర్నమెంట్‌కు స్టార్స్ కృతజ్ఞతలు చెబుతున్నారు. నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించారంటూ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు చిరు. ఆ వెంటనే యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని థ్యాంక్స్‌లు చెప్పినా తక్కువేనంటూ ట్వీట్ చేశారు. కానీ బాలకృష్ణ ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంపై పలువురు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout